ఆర్టీసీ డ్రైవర్లకు అనుభవంలేదంటూ హైకోర్టులో పిల్

కనీసం 90రోజులపాటు శిక్షణ ఇప్పించాలంటూ పటిషనర్ అభ్యర్థన

Telangana High Court
Telangana High Court

హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో యాజమాన్యం తాత్కాలిక డ్రైవర్లను నియమించి బస్సులు నడిపిస్తున్న నేపథ్యంలో సదరు డ్రైవర్లకు అనుభవంలేదంటూ.. హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గోపాలకృష్ణ ఈమేరకు పిల్ వేశారు. తాత్కాలిక డ్రైవర్లకు కనీసం 90 రోజులపాటు శిక్షణ ఇచ్చేవిధంగా ఆర్టీసీ యాజమాన్యానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు నాలుగు వారాల్లో వివరణ సమర్పించాలంటూ ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి అదేశాలను జారీచేసింది. కాగా సెప్టెంబర్ నెల వేతనాలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు వేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/