విద్యార్థుల కృషి, పట్టుదల కనిపించింది

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

జనగామ: ఉమ్మడి జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌కు రావడం సంతోషంగా ఉందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సైన్ ఫేర్‌లో ఎర్రబెల్లి మాట్లాడారు. విద్యార్థినిలు చేసిన ఎగ్జిబిట్లలో వారి పట్టుదల, కృషి కనపడిందని పొగిడారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర వ్యాప్తంగా 16 గురుకులాలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తరువాత 246 కొత్త గురుకులాలను సిఎం కెసిఆర్ మంజూరు చేశారని కొనియాడారు. తెలంగాణ వ్యాప్తంగా 83 వేల మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. విద్యారంగానికి సిఎం కెసిఆర్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రశంసించారు.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/