అరెస్టులు చేయడానికి మీరెవరు!

పోలీసులపై ఆగ్రహించిన ఉత్తమ్‌

Uttam kumar reddy
Uttam kumar reddy

హైదరాబాద్‌: తెలంగాణలో నేడు కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్షలో భాగంగా పిసిసి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దీక్షలో పాల్గొనేందుకు వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిజిపి, సిపిలకు ఫోన్‌ చేసి నిలదీశారు. తమ పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను అడ్డుకుంనేందుకు మీరెవరని ప్రశ్నించారు. బిజెపి, ఎంఐఎం కార్యక్రమాలకు అనుమతిచ్చి, మేం శాంతియుతంగా ర్యాలీ చేస్తే అరెస్టులు చేస్తారా అంటూ మండిపడ్డారు. దీక్ష చేస్తే అరెస్టులు చేయాలని ఎవరు చెప్పారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చేపట్టిన సత్యాగ్రహాన్ని అడ్డుకోవడం ఓ పెద్ద కుట్ర అని వ్యాఖ్యానించారు. దేశంలో కాంగ్రెస్‌ను ఎవ్వరూ ఏమి చేయలేరని, నియంతృత్వానికి త్వరలోనే స్వస్తి పలుకుతామని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఒక న్యాయం, కాంగ్రెస్‌కు ఒక న్యాయమా.. సత్యాగ్రహానికి కెసిఆర్‌ అనుమతివ్వకపోవడం సిగ్గు చేటని దూషించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/