రేపు పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధం

counting votes
counting votes

హైదరాబాద్‌: పరిషత్‌ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ మొదలుకానున్నది. మొత్తం 2,426 మంది జెడ్పీటిసి అభ్యర్ధులు, 18,930 మంది ఎంపిటిసి అభ్యర్ధుల భవితవ్యం తేలిపోనున్నది. గత నెల 27న ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఈసి తొలుత నిర్ణయించింది. సాయంత్రం 5 గంటల లోపు లెక్కింపు పూర్తి చేసేలా ఈసి చర్యలు చేపట్టింది. పాత సభ్యుల పదవీకాలం ఉండగానే..కొత్త సభ్యులు, నూతన ఛైర్మన్లు, అధ్యక్షులను ఎన్నుకునేందుకు ప్రభుత్వం చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 123 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 536 స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరచిన బ్యాలెట్‌ బాక్స్‌లను లెక్కింపు కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లను లెక్కించనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/