తల్లిదండ్రులు ఆడపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి

swathi lakra
swathi lakra

హైదరాబాద్‌: దిశ హత్యాచార ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశావ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణ ఘటనకు సంబందించి ఉమెన్స్‌ వింగ్‌ అధినేత్రి స్వాతి లక్రా స్పందించారు. సమాజంలో మార్పు రావాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. మహిళల రక్షణ బాధ్యతలో పోలీసుల కంటే మిన్నగా తల్లిదండ్రుల బాధ్యత కీలకమేనని తెలిపారు. మహిళల రక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఆపదలో ఉన్న మహిళలు 100 డయల్‌ చేయాలని సూచించారు. పెట్రోలింగ్‌ వెహికల్స్‌ సిబ్బంది క్షణాలలో చేరుకొని వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతోందన్నారు. పోకిరీల భరతం పట్టేందుకు షీటీమ్స్‌ రంగంలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో తొలుత వంద షీటీమ్స్‌ రంగంలోకి దిగగా, అనంతర కాలంలో సైబరాబాద్‌, రాచకొండ తదితర మొత్తం తొమ్మిది కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 310 షీటీమ్స్‌ పనిచేస్తున్నాయని స్వాతి లక్రా తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలకు ఈ హాక్‌ఐ యాప్‌ ఉపయుక్తంగా ఉంటోందన్నారు. హాక్‌ఐ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఇప్పటికే పలు కాలేజీలు, స్కూల్స్‌లో సమావేశాలు నిర్వహించమన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/