పల్లెప్రగతి నిధులు సమర్ధవంతంగా ఉపయోగించాలి

పల్లెప్రగతి అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

హన్మకొండ: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకు ఇచ్చిన నిధులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సూచించారు. హన్మకొండలో జరిగిన రెండో విడత పల్లెప్రగతి అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి సిఎం కెసిఆర్‌ నిధులిచ్చి కొన్ని బాధ్యతల్ని అప్పగించారని అన్నారు. అయితే వాటిని సక్రమంగా నిర్వర్తించి, పల్లె నిధులను గ్రామ ప్రతినిధులు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అవసరమైతే పంచాయతీ నిధులను సర్దుబాటు చేసుకోవాలని అన్నారు. వీలైంనంత త్వరగా గ్రామాల్లో అన్ని విధాల అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/