ఆయన్ను మళ్లీ ప్రభుత్వంలో చూడాలనుంది

Asaduddin Owaisi
Asaduddin Owaisi

హైదరాబాద్‌: గతంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కెటిఆర్‌ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నారు. అయినాగానీ, అనేక దిగ్గజ సంస్థలను హైదరాబాద్ తీసుకురావడంలో ఆయన కృషి ఎంతో ఉందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. కిందటేడాది ఒప్పో, ఈమధ్య అమెజాన్, నేడు వన్ ప్లస్ రాకతో హైదరాబాద్ గ్లోబల్ పవర్ గా ఎదుగుతోందని ఓ పాత్రికేయుడు చేసిన ట్వీట్ పై ఒవైసీ స్పందించారు. ఇదంతా కేటీఆర్ శ్రమ ఫలితమేనని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కేటీఆర్ ను మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తుండగా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. అసద్ చేసిన ఈ ట్వీట్ కు కెటిఆర్‌ స్పందించారు. ఎంపీ గారు ఎంతో మంచి మాటలు చెప్పారు, కృతజ్ఞతలు అంటూ కెటిఆర్‌ ట్వీట్ చేశారు.తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/