టిఆర్ఎస్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి టిఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు పోతుందని ఆమె విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ లో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులను టీఆర్ఎస్ ఆసరాగా తీసుకుందని… రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడాన్ని అనుకూలంగా మలుచుకుందని చెప్పారు. టిఆర్ఎస్ పార్టీ గుర్తించాల్సిందేమిటంటే … ప్రస్తుత సంక్షోభ సమయాన్ని అధిగమించి, అధికార పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా… ఆ పోరాటానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/movies/