మేడిగడ్డలో వరుణుడి కరుణ కోసం హోమం

jala sankalpa homam
jala sankalpa homam

భూపాలపల్లి: తెలంగాణలో తరతరాల కల మరికొద్దిసేపట్లో సాకారం కానుంది. ఇవాళ ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజి వద్ద వరుణుడి కరుణ కోసం వేద పండితులు జల సంకల్పహోమం నిర్వహిస్తున్నారు. శృంగేరి పీఠానికి చెందిన ఫణి శశాంక్‌ శర్మ, గోపీకృష్ణ ఆధ్వర్యంలో 40 మంది వేద పండితులు పూజలు చేస్తున్నారు. టిఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, రాష్ట్ర మంత్రులు, అధికారులు మేడిగడ్డ చేరుకున్నారు. వీరు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా పూజలు చేసేందకు అన్ని ఏర్పాట్లు చేశారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/