తెలంగాణలో రేపటి నుండి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం

ఉదయం 10.30 గంటలకు క్లాసులు ప్రారంభం

Online classes for Telangana schoolchildren from Sep 1

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రేపటి నుండి ఆన్ లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. 3వ తరగతి నుంచి ఇంటర్ వరకు దూరదర్శన్, టీశాట్ ద్వారా డిజిటల్ తరగతులకు నిర్వహించనున్నారు. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించనున్నారు. ఒక్కో క్లాసు సమయం గరిష్టంగా అరగంట ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ క్లాసులను ఉపయోగించుకునేలా చూసే బాధ్యత టీచర్లదేనని చెప్పారు.

కాగా తెలంగాణలో ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/