రంజాన్‌కు పాతబస్తీ సిద్ధం

old city ready for ramjan fest
old city ready for ramjan fest

హైదరాబాద్‌: రంజాన్‌ మాసంలో ఘుమఘుమలాడే హలీం తయారీ కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని మదీనా, చార్మినార్‌ దూద్‌బౌలి, శాలిబండ, సయ్యద్‌ అలీ ఛబుత్రా తదితర ప్రాంతాల్లో రంజాన్‌ మాసంలో మదిని దోచే హలీం అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. హలీంల తయారీ కోసం బట్టీలను ఇప్పటికీ సిద్ధం చేస్తున్న నిర్వాహకులు హలీంను రుచుల సమ్మేళనం చేసే డేగ్చాలను తయారు చేస్తున్నారు. మరోవైపు రంజాన్‌ సమీపిస్తున్న తరుణంలో నగరంలో చేతినిండా పనిని అందిపుచ్చుకోవడానికి ఇతర ప్రాంతాల నుంచి కార్మికులు వలస వచ్చి పనులు చేపట్టడానికి మొగ్గు చూపిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/