నేడు ఇరు రాష్ట్రాల అధికారుల సమావేశం

Pragati Bhavan
Pragati Bhavan

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో ఈరోజు ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం కానున్నారు. ఢిల్లీలోని ఏపి భవన్‌ విభజనపై, 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థలుపై విద్యుత్‌ సంస్థల వివాదాలు, పౌరసరఫరాల సంస్థ బకాయిల చెల్లింపుపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ఇరురాష్ట్రాల సీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. విభజన సమస్యలపై శుక్రవారం మొదటిసారిగా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై దాదాపు నాలుగు గంటలపాటు చర్చించిన విషయం తెలిసిందే.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/