హైదరాబాద్ లోడ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిలిపివేత

కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల తాత్కాలిక నిర్ణయం

No drunk and drive tests in Telangana
No drunk and drive tests in Telangana

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతుంది. నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించారు. తనిఖీల సందర్భంగా మిషన్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో జనం ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదేదో బాగుందే అని మందుబాబులు సంబరపడిపోవడానికి లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) వాహన చోదకులను గమనిస్తుంటాయని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.ఇదే సమయంలో పెండింగ్ చలానాల వసూళ్ల పై దృష్టి పెట్టాలని అధికారులు నిర్ణయించారు. సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి వాహన చోదకులకు జరిమానాలు పంపుతుంటారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/