జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డికి ఎన్‌ఎంయూ షాక్‌..

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: ఎలాంటి షరతులు విధించకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్దమని కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన ఎన్‌ఎంయూ నేతలు జేఏసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. 47 రోజుల నుండి చేస్తున్న ఆర్టీసి సమ్మెకు, కార్మికుల బలిదానాలకు అర్థం లేకుండా పోతుందని రూ.400 కోట్లు ఆర్థిక నష్టాన్ని పక్కన పెట్టి సమ్మె విరమిస్తామనడం సమ్మతం కాదని ఎన్‌ఎంయూ నాయకులు విమర్శించారు. ఇంకా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను గాలికొదిలేసి..కార్మికులను నట్టేట ముంచారని అన్నారు. ఒక్క డిమాండ్‌ కూడా పరిష్కారం కాకుండానే సమ్మెను ఎలా విరమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండానే సమ్మెను విరమిస్తామనడంపై కార్మికులకు సమాధానం చెప్పాలని మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. జేఏసీ నేతలు కార్మికుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని..వారు విధుల్లో చేరడానికి సిద్దంగా లేరని ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై జేఏసీ-1 ఈ రోజు సమావేశమవుతున్నట్టు చెప్పారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/