సీతారామచంద్రస్వామి వారి నిత్య కల్యాణం

bhadrachalam
bhadrachalam

భద్రాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో రాములోరి నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున అర్చకులు స్వామి వారికి సుప్రభాత సేవ జరిపారు. తరువాత ఆరాధన, ఆరగింపు గావించారు. తదుపరి భక్తులకు భద్రాద్రి రాముని దర్శనం కల్పించారు. నిత్యకల్యాణ మూర్తులను అందంగా అలంకరించి, పల్లకీపై ఊరేగింపుగా బేడా మండపం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారిని వేంచేయింపజేసి సాంప్రదాయబద్ధంగా స్వామి వారి కల్యాణ క్రతువును జరిపారు. భక్తరామదాసు వారు చేయించిన బంగారు ఆభరణాలను శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ధరింప జేసి శోభయామానంగా రామయ్య కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/