మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

NHRC
NHRC

మహబూబ్‌నగర్‌: షాద్‌నగర్‌ చటాన్ పల్లి వద్ద దిశ నిందితుల ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ) రంగంలోకి దిగింది. ఈ ఉదయమే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు చటాన్ పల్లి బ్రిడ్జి వద్ద కాల్పులు జరిగిన ప్రదేశంలో పర్యటించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం, దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురి మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికలను కూడా పరిశీలించారు. ఎన్ హెచ్ఆర్సీ బృందం పర్యటన నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/