జలాశ‌యంలో చేప పిల్లలు విడుదల

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

నిర్మల్ :  మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాదవక్ , అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగ‌ళ‌వారం గాంధీన‌గ‌ర్ గ్రామ శివారులోని శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ ఎగువన ఉన్న   జలాశ‌యంలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు అన్నిరకాలుగా ప్రయోజనం జరిగిందని, మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ వెలుగు నింపారని తెలియజేశారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా 100 శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. ముఖ్యంగా వారికి కావాల్సిన మోపెడ్ లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంద‌న్నారు. మత్స్య రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని  81 కోట్ల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు . ప్రతి సంవత్సరం శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ లోకి 5 కోట్ల చేప పిల్లలను విడుద‌ల చేస్తున్నామ‌న్నారు. 

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/