11న తెలంగాణ నూతన గవర్నర్‌ ప్రమాణం

Tamilisai Soundararajan
Tamilisai Soundararajan

హైదరాబాద్‌ : ఈ నెల 11 వ తేదీన తెలంగాణ నూతన గవర్నర్‌ గా తమిళిపై సౌందరరాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి చెన్నైలో తమిళిసైను కలిసి, తెలంగాణ నూతన గవర్నర్‌ గా నియామకపత్రాన్ని అందించారు. వాస్తవానికి ఈ నెల 8 న తమిళిపై ప్రమాణస్వీకారం చేయాల్సి ఉండగా, ప్రస్తుత గవర్నర్‌ నరసింహన్‌ ఈ నెల 10 న బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. దీంతో, మరుసటి రోజున ప్రమాణస్వీకారం చేసేందుకు తమిళిపై సౌందరరాజన్‌ సిద్ధమయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/