నగరంలో హోటల్‌ భవనం పైనుంచి దూకి నేపాలీ ఆత్మహత్య

Suicide
Suicide

హైదరాబాద్‌: నగరంలోని అబిడ్స్‌ తాజ్‌ మహల్‌ హోటల్‌ భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి మద్యం తెల్లవారుఝామున తాజ్‌ మహల్‌ హోటల్‌ 2వ అంతస్తు నుంచి దూకి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతడిని నేపాల్‌కు చెందిన మోతి(30)గా గుర్తించారు. నెల రోజుల క్రితం హోటల్‌లో వెయిటర్‌గా విధుల్లో చేరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆర్థిక, కుటుంబ సమస్యలే మృతికి కారణమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/