100కి కాల్‌ చేసిన యువతి: సమయం లేదన్న పోలీసులు

dial 100
dial 100

నల్గొండ: ఎవరైనా ఆపదలో ఉంటే 100 కాల్‌ చేస్తే పోలీసులు కాపాడతారనే మాటల్లో వాస్తవం లేదని నల్గొండ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే నల్గొండ జిల్లాకు చెందిన గుండ్లపల్లి క్రాస్‌ రోడ్‌, ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మీ కుటుంబసభ్యుల్ని పక్కింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారు. ప్రశ్నిస్తే దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తక్షణ సాయం కోసం విజయలక్ష్మీ 100కి కాల్‌ చేసింది. అయితే మిమ్మల్ని వన్‌టౌన్‌ పోలీసులు సంప్రదిస్తారంటూ ఓ టెక్ట్స్‌ మెసేజ్‌ వచ్చింది. కొద్దిసేపటికి వన్‌ టౌన్‌ పోలీసులు బాధితురాలికి ఫోన్‌ చేసి మేం లంచ్‌ చేస్తున్నాం. మీ దగ్గరకు వచ్చే సమయం లేదు. మీరే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయండి తర్వాత దాడి చేసిన వారిని పట్టుకుంటాం అనే సమాధానం ఇచ్చారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి తనకు జరిగిన ఛేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. కాగా విజయలక్ష్మీ పోస్ట్‌పై ఎస్పీ రంగనాథ్‌ స్పందించారు. బాధితురాలి పట్ల నిర్లక్ష్యం వ్యవహరించిన పోలీసుల్ని, దాడికి పాల్పడ్డ నిందితులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/