నగేశ్‌ ముదిరాజ్‌ పై సస్పెండ్‌ వేటు

Nagesh Mudiraj
Nagesh Mudiraj

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతృత్వంలో ఈనెల 11వ తేదీ చేపట్టిన అఖీలపక్ష నిరసన దీక్షలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా కోసం వేసిన కుర్చీలో కాంగ్రెస్‌ నేత నగేశ్‌ కూర్చనేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశమైంది. నగేశ్ ముదిరాజ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్‌ను సస్పెండ్ చేస్తూ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. తనను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీభవన్ ఎదుట నగేశ్ నిరసనకు దిగాడు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/