పాల వ్యాపారంతో ప్రారంభమైంది నా సక్సెస్‌

Malla Reddy
Malla Reddy

హైదరాబాద్‌: మాదాపూర్‌ శిల్పకళావేదికలో టీఎస్‌-ఐపాస్‌ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కెటిఆర్‌, మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మట్లాడుతూ..ఐదు సంవత్సరాలల్లో టిఎస్‌-ఐపాస్‌ సక్సెస్‌ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను చిన్నప్పుడు సైకిల్‌ మీద పాలు సరఫరా చేశానని..ఇప్పుడు మినిష్ట అయ్యానని తెలిపారు. పాల వ్యాపారంతో ప్రారంభమైన తన సక్సెస్‌ మల్లారెడ్డి విద్యాసంస్థల వరకు వచ్చానంటే అందుకు నిదర్శనం కష్టం అన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏది లేదనడానికి తానే నిదర్శమని ఆయన తెలిపారు. అందరం కలిసి పని చేసి దేశంలోనే తెలంగాణను నంబర్‌-1 స్థానానికి తేవాలన్నారు. తెలుగువారికి తెలివి ఎక్కువని యువత కసిగా లక్ష్యాలను చేరుకోవాలని ఆయన సూచించారు. టిఎస్‌-ఐపాస్‌ 5 సంవత్సారాలలో అబివృద్ధి చెందడానికి మంత్రి కెటిఆర్‌ కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే కెటిఆర్‌పై ప్రశంశలు గుప్పించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/