పటాన్‌చెరు వద్ద వ్యక్తి దారుణ హత్య

murdere
murdere

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు మండలం రుద్రారం జాతీయ రహదారిపై పట్టపగలే దారుణ హత్య జరిగింది. అయితే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మహబూబ్ అనే వ్యక్తిని నరికి చంపి పరారీ అయ్యారు. మహబూబ్‌ ను మూడు నాలుగు సార్లు కత్తితో విచక్షణారహితంగా నరికారు. ఈ ఘటన జరిగిన సమయంలో జాతీయ రహదారిపై ఏ ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు. దుండగులను ఆపేందుకు ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఈ దారుణ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/