భారతదేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది

MP Vinod Kumar
MP Vinod Kumar

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి దేశానికి తీరని లోటు అని మాజీ ఎంపి వినోద్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. భారత దేశం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. చిన్న వయస్సులో జైట్లీ చనిపోవడం దురదృష్టకరమని వినోద్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జైట్లీ సేవలు మరవలేనిదని గుర్తు చేశారు. సిఎం కెసిఆర్, పలువురు మంత్రులు జైట్లీ మృతిపట్ల సంతాపం తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నాయకుడు అరుణ్ జైట్లీ శనివారం మద్యాహ్నం కన్నుమూశారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/