మానవత్వాన్ని చాటిన కవిత

MP K Kavitha
MP K Kavitha

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఎంపి కవిత మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దగ్గరుండి దవాఖానకు తరలించారు. అయితే ఎంపి కవిత సోమవారం సాయంత్రం నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం కేశ్‌పల్లికి వెళ్తుండగా ధర్మారం గ్రామ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి వెంటనే కారు దిగి అంబులెన్స్‌కు, డాక్టర్‌కు ఫోన్లు చేయించారు. క్షత్రగాత్రుడిని అంబులెన్స్‌లో దవాఖానకు తరలించడమేగాక మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను కోరారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/