సరిహద్దుల్లో మరింత భద్రత

రాకపోకలను నిషేదించిన పోలీసులు

telangana police stops vehicles at maharstra boarder
telangana police stops vehicles at maharstra boarder

ఆదిలాబాద్‌: తెలంగాణ- మహరాష్ట్ర సరిహద్దులో భద్రతను పోలిసులు మరింత కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి వచ్చేవారిని అడ్డుకుంటున్నారు. అటునుంచి వచ్చే వారిని తిరిగి పంపిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న మహరాష్ట్ర రహదారులు, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అన్నింటిని మూసివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలో మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పోలీసు యంత్రాంగం అన్ని చెక్‌పోస్టులను మూసివేయించారు. మహరాష్ట్రలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో అధికారు లు ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తిగా రాకపోకలను నిషేదించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/