సరిహద్దుల్లో మరింత నిఘా

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో కఠిన నిబంధనలు

lockdown
lockdown

తెలంగాణ: రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు నమోదు అవుతుండడంతో తెలంగాణ అధికారులు సరిహద్దులో నిఘాను మరింత కఠినం చేశారు. నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మూడు రాష్ట్రాల ప్రవేశ మార్గాల వద్ద నిర్బందం విధించారు. సలాబత్‌, సాలూరా, కందకుర్తి గ్రామాల పరిధిలో చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత కఠినం చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైన బయటకు వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. సరిహద్దులు దాటకుండ మరింత అప్రమత్తంగా ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/