రవిప్రకాశ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

ravi prakash
ravi prakash, TV9 ceo

హైదరాబాద్‌: టివి9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌ కేసులో సైబర్‌క్రైమ్‌ పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. మరిన్ని ఆధారాలతో రవిప్రకాశ్‌ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకునే అవకావం ఉంది. రవిప్రకాశ్‌, శివాజీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని, వారు పాత తేదీల్లో నకిలీ షేర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు ఆధారాలు లభించాయి. మూర్తి, రవిప్రకాశ్‌, హరి మధ్య బదిలీ ఐన పలు ఈమెయిళ్లను దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్‌, ఆయన అనుచరులు తొలగించారు.
రవిప్రకాశ్‌ నుంచి 2018 ఫిబ్రవరి 20వ తేదీన ఒప్పందం కుదుర్చుకున్నట్లు నకిలీ పత్రాలను సృష్టించారు. 40 వేల షేర్ల కొనుగోలుకు శివాజీ ఒప్పందం కుదర్చుకున్నట్లు నకిలీ పత్రాలు క్రియేట్‌ చేశారు. ఒప్పంద ముసాయిదాను వాస్తవానికి 2019 ఏప్రిల్‌ 13న తయారు చేసినట్లు గుర్తించారు. వీరందరి మధ్య మెయిళ్ల బదిలీ ఐనట్లు పోలీసులకు ఆధారాలు దొరికాయి. వీటి ఆధారంగా సెక్షన్‌ 41 సిఆర్పీసి కింద పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసులు జారీ చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/