ఎప్పటికి టిఆర్‌ఎస్‌లోనే ఉంటాను

Thatikonda Rajaiah MLA
Thatikonda Rajaiah MLA

హైదరాబాద్‌ : జీవితాంతం తాను టిఆర్ఎస్ తోనే ఉంటానని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యె తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అండదండలతో తాను నాలుగు సార్లు ఎమ్మెల్యె గా గెలిచినట్టు రాజయ్య వెల్లడించారు. కెసిఆర్ ఏ బాధ్యత అప్పగించినా, చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ఎదిగేందుకు కెసిఆర్, కెటిఆర్ తనను ఎంతగానో ప్రోత్సహించారని ఆయన తెలిపారు. పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, సిఎంగా కెసిఆర్ ను ప్రతిపాదించే అవకాశం తనకు ఇవ్వడం తన అదృష్టమని రాజయ్య వెల్లడించారు. కెసిఆర్ తీసుకునే నిర్ణయాలకు కట్టబడి ముందుకు సాగుతానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా తనను ప్రోత్సహించిన కెసిఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని రాజయ్య చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/