దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణలో

Talasani Srinivas Yadav
Talasani Srinivas Yadav

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ..చేతకాని దద్దమ్మలు అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారని తలసాని విమర్శించారు. ప్రగతి భవన్‌ను ముట్టడించి అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే 55 శాతం పంటలు తెలంగాణ రాష్ట్రంలోనే పండుతున్నాయని తెలిపారు.

మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని తీసుకురావడం కోసమే పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. పల్లె పల్లెల్లో రైతులు ఆనందంగా ఉండటం కోసమే అన్ని వసతులను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. గతంలో గోపాలమిత్ర జీతాలను రూ.3000 వేల నుండి రూ.8000 వేల వరకు పెంచిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. కరోనా సమయంలో కూడా రైతులు పండించిన పంటను కొనుగోలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని మంత్రి తలసాని పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/