బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన తలసాని

talasani srinivas yadav
talasani srinivas yadav

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అర్హులైన మహిళలకు మంగళవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణలో కోటి మందికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పేద మహిళలు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నదే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల మహిళల కోసం కెసిఆర్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన కొనియాడారు. తెలంగాణ ఏర్పాటు తరువాత బతుకమ్మ పండుగ పునరజ్జీవనం పొందిందని చెప్పారు. తెలంగాణ ఆచార, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ మహిళలు బతుకమ్మ ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/