బతుకమ్మ చీరెల పంపిణీ ప్రారంభం

minister-puvvada-distributes-bathukamma-sarees

ఖమ్మం: సిఎం కెసిఆర్‌ బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం ప్రారంభయిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. జిల్లాలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతినగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరెల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు బతుకమ్మ చీరెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు రూ. 317 కోట్లు ఖర్చు పెట్టి కోటి మంది మహిళలకు ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందన్నారు. రాష్ట్ర పండుగైన బతుకమ్మ సందర్భంగా ప్రతి ఆడబిడ్డకు ప్రభుత్వ కానుకగా చీరెల పంపిణీ చేస్తుందన్నారు. తొలుత 8 డిజైన్లతో ప్రారంభించి 287 విభిన్నమైన డిజైన్స్ లలో బంగారు, వెండి జరీ అంచులతో తయారీ చేయబడిన పాలిస్టర్ పిలిమెంట్, నూలు చీరెలు అందిస్తున్నారన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/