ప్రమాదంలో గాయపడ్డ వారికి సాయం చేసిన మంత్రి

puvvada ajay kumar
puvvada ajay kumar

ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ ఆపదలో ఉన్న వారికి సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. ఈ రోజు ఉదయం ఖమ్మంలో పర్యటించిన పువ్వాడ తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా మార్గ మధ్యలో లారీ-బైక్‌ ఢికొని ప్రమాదం జరిగింది. అదే మార్గంలో ప్రయణిస్తున్న మంత్రికి ప్రమాదం గురించి తెలియడంతో వెంటనే ప్రమాద స్థలికి చేరుకొని గాయపడ్డవారిని ట్రీట్‌ మెంట్‌ కోసం తన పోలీస్‌ ఎస్కార్ట్‌ వాహనంలో హస్పిటల్‌కి తరలించారు. వరంగల్‌ క్రాస్‌ రోడ్డు దగ్గర లారీ-బైక్‌ ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయలయ్యాయి. అంబులెన్సు వచ్చే సరికి ఆలస్యం అవుతందని గ్రహించిన పువ్వాడ తన ఎస్కార్ట్‌ వెహికల్‌ లోనే క్షతగాత్రులను ఆయన సొంత హస్పిటల్‌ అయిన మమత హస్పిటల్‌కి తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/