వరంగల్‌లో మరో ఐటీ కంపెనీ.. 500 జాబ్స్‌

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే అంటున్న కెటిఆర్‌

Minister KTR
Minister KTR

హైదరాబాద్‌: స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను వరంగల్‌ ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని స్వయంగా ఐటీ మంత్రి కెటిఆర్‌ వెల్లడించారు. స్థానిక యువతకు ఇప్పటికే కరీంగనర్‌లో ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈనెల 18న ఆ ఐటీ టవర్‌ను ప్రారంభించనున్నారు. టవర్‌ను ప్రారంభించే తొలిరోజే 400 మందికి పైగా ఐటీ ఉద్యోగులు పని చేయనున్నారు. అయితే అదే తరహాలో వరంగల్‌లోనూ ఐటీ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కెటిఆర్‌ తాజాగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అందుకు సంబంధించి వరంగల్ అభివృద్ధి కేంద్రం నిర్మాణాన్ని ఈనెల 16న ప్రారంభించనున్నారు. క్వాడ్రంట్ రిసోర్స్ ఆధ్వర్యంలో 1.5 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ టవర్‌లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ టవర్ వల్ల దాదాపు 500 మంది స్థానిక యువతకు జాబ్స్ దొరకనున్నాయి. ఈ సందర్భంగా క్వాడ్రంట్ రిసోర్స్ ఫౌండర్, సీఈఓ వంశీరెడ్డికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/