సామజవరగమనా పాటకు కెటిఆర్‌ ఫిదా

Minister KTR
Minister KTR

బెర్న్ నగరం: ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనే నిమిత్తం దావోస్ లో ఉన్న తెలంగాణ మునిసిపల్ మంత్రి తారకరామారావు, పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. స్విస్ కాలమానం ప్రకారం, ప్రస్తుతం తెల్లవారుజామున 3.30 గంటలైందని, ఈ సమయంలో తన స్మార్ట్ ఫోన్ నుంచి ‘సామజ వర గమనా…’ పాటను వింటున్నానని కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ‘వాటే బ్రిలియంట్ సాంగ్…’ అని కితాబునిస్తూ, సంగీత దర్శకుడు థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాట తన మదిని వీడటం లేదని అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/