కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదు

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో కెటిఆర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధన్యత సంతరించుకుంది. తెలంగాణకు రావాల్సిన అనేక ప్రాజెక్టులు రావడం లేదని కెటిఆర్‌ అన్నారు. చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని కేంద్రం ఎందుకు ఆమోదం తెలపడం లేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి అంటే కేవలం నాగ్‌పూర్‌కేనా అని కామెంట్‌ చేశారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపిస్తోందని..అభివృద్ధిని కేవలం గుజరాత్‌, మహారాష్ట్ర, చెన్నై వంటి నగరాలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రపంచస్థాయి మౌళిక వసతులు ఉన్న హైదరాబాద్‌కు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహిస్తోందని కెటిఆర్‌ విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/