త్వరలో కొత్త పురపాలక చట్టం ..

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రజల సౌకర్యం లక్ష్యంగా కొత్త పురపాలక చట్టాన్ని పక్కగా అమలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ తెలిపారు. నిర్మాణం చేపట్టుకోవాలనుకొనే వారికి సులభంగా, వేగంగా అనుమతులు పొందే విధంగా నూతన విధానం తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. బుద్ధ భవన్‌లో శుక్రవారం రాష్ట్ర టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందితో కెటిఆర్‌ సమావేశం నిర్వహించారు. సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న నిర్మాణ అనుమతుల ప్రక్రియను మార్చేటప్పుడు, తొలుత కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, కానీ మార్పు సాధించి తీరతామని మంత్రి కెటిఆర్‌ వెల్లడించారు. గతంలో పరిశ్రమల శాఖ అనుమతుల విధానం పూర్తిగా సింగిల్‌ విండో పద్ధతిని తీసుకొచ్చిన విధానాన్ని గుర్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని అనుమతుల ప్రక్రియలో సమయాన్ని తగ్గించి, పారదర్శకతను పెంచే లక్ష్యంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/