జలమండలి అధికారులతో మంత్రి సమీక్ష

K. T. Rama Rao
K. T. Rama Rao

హైదరాబాద్‌: దేశంలోని ఏ నగరంలో లేని విధంగా స్వచ్ఛమైన మంచినీటితో హైదరాబాద్‌ మహానగర వాసుల దాహార్తిని తీరుస్తున్నట్లు రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె. తారక రామరావు చెప్పారు. ఈ మేరకు బుద్ధభవన్‌లో జలమండలి రెవెన్యూ పెంపు, మంచినీటి సరఫరా విషయమై ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ..సుదూరంలో ఉన్న కృష్ణా, గోదావరి నదులతో పాటు హిమయత్‌ సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి నీటిని తీసుకువచ్చి శుద్ది చేసి హైదరాబాద్‌ నగరవాసులకు అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రింగ్‌ మెయిన్‌తో నీటి లభ్యత ఉన్న నగరంలోని ప్రతి ప్రాంతానికి మంచినీటి సరఫరా చేయవచ్చని, ఈరింగ్‌ మెయిన్‌తో పాటు రూ.280 కోట్లతో మరో రింగ్‌ మెయిన్‌ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. వీటి ఏర్పాటుతో మహానగరంలో ఏ కాలంనైనా నీటి కొరత లేని నగరంగా హైదరాబాద్‌ రుపొందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదాయం పెంచుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి జలమండలి నూతన సంస్కరణలను అందుబాటులోకి తీసుకురావాలని కెటిఆర్‌ సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/