కెసిఆర్‌కు కొత్త నిర్వవచనం చెప్పిన కెటిఆర్‌

K- అంటే కాల్వలు, C- అంటే చెరువులు,R- అంటే రిజర్వాయర్లు

ktr
ktr

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కెటిఆర్‌ సిఎం కెసిఆర్‌ పేరుకు కొత్త నిర్వచనం చెప్పారు. KCRలో Kఅంటే కాల్వలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు అని అర్థమని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తెలంగాణలో కాల్వలు, చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయనే ఉద్దేశంతో కెటిఆర్ ఈ విధంగా స్పందించారు. నేడు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజక్ట్‌లో భాగమైన కొండపోచమ్మ రిజర్వాయర్‌ పంప్‌హౌస్‌ను కెసిఆర్‌ ప్రారంభించారు. దీనిపై స్పందించిన కెటిఆర్‌.. మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ వరకు, సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు వరకు నీటిని చేరవేశామని కెటిఆర్ వివరించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని దేశంలోనే యువ రాష్ట్రమైన తెలంగాణ కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసిందని తెలిపారు. ఇండియాలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం కేవలం మూడేళ్లలోనే ఈ ప్రాజక్టును నిర్మించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల 2.85 లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందని చెప్పారు. త్వరలోనే ప్రారంభం అయ్యే కేశవపురం రిజర్వాయర్ ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/