బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌

Minister KTR

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఈరోజు మరో 45 బస్తీ దవాఖానాల ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్‌‌లో 22, మేడ్చల్‌‌లో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో 3 బస్తీ దవాఖానాలు మొదలుకానున్నాయి. 45 బస్తీ దవాఖానాలతో అదనంగా 4వేల మందికి వైద్యం అందనుంది. ఒక్కో బస్తీ దవాఖానాలో ఒక వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారు. ఈనేపథ్యలో మంత్రి కెటిఆర్‌ జిహెచ్‌ఎంసి పరిమితిలో ఎర్రగడ్డలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు. మంత్రి కెటిఆర్ బస్తీ దావా ఖానా వైద్యుడితో సంప్రదించి తన బిపిని తనిఖీ చేసుకున్నారు. అనంతరం అక్కడి ప్రాంత ప్రజలతో మాట్లాడారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/