ఐటీ కంపెనీలను ప్రారంభించిన కెటిఆర్‌


Minister Sri KT Rama Rao inaugurating Tech Mahindra and Cyient Campus at Warangal

వరంగల్‌: జిల్లాలో ఐటీ దిగ్గజాలు సైయెంట్‌, టెక్‌ మహీంద్రా ప్రాంగణాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ప్రారంభించారు. టెక్‌ మహీంద్రాలో 100 నుంచి 150 మంది వరకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. సైయెంట్‌లో 600 నుంచి 700 మంది ఉద్యోగులతో టెక్‌ సేవలు అందించేలా అన్ని అత్యాధునిక హంగులతో ఈ కంపెనీలను నిర్మించారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. వరంగల్‌ ఐటీ సెజ్‌లో మంత్రి కెటిఆర్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని 2016 ఫిబ్రవరిలో ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా 2017లో ఐదు ఎకరాల్లో 3 కంపెనీలను ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/