రాష్ట్ర వ్యాప్తంగా 967 గురుకుల పాఠశాలు

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నడుపుతున్నాం

Minister Koppula Eshwar
Minister Koppula Eshwar

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 967 గురుకుల పాఠశాలు ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. గురుకులాలను ఎటువంటి లోటు లేకుండా నిర్వహించాలన్నదే ప్రభుత్వ ఉద్ధేశ్యామని, గురుకులాల నిర్వహణకు రూ. 5,719 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలన్నీ కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా పనిచేస్తున్నాయని, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీతోపాటు జాతీయ స్థాయి పరీక్షల్లో సత్తా చాటుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఖాళీల భర్తీతో బోధనా ప్రమాణాలు మరింత పటిష్టమవుతాయని తెలిపారు. ఖాళీలపై వివరాలను త్వరలో తెప్పించుకుని భర్తీకి అవసరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

తాజా ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/