సూర్యాపేట బహిరంగ సభలో మంత్రి జగదీష్‌ రెడ్డి

కెసిఆర్ పథకాలతో టిఆర్ఎస్ లో చేరికలు…

Minister Jagadish Reddy
Minister Jagadish Reddy

సూర్యాపేట: సీనియర్ కాంగ్రెస్ నేత జహీర్, బిజెపి సీనియర్ నేత, సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు రామగిరి నగేష్ లు తమ అనుచరులతో కలిసి ఈరోజు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి టిఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ మాట్లాడుతు తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీలకు చెందిన వారు టిఆర్ఎస్ లో చేరుతున్నారని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలు, కొట్లాటలు ఆగిపోయి అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని ఆయన పేర్కొన్నారు.2014, 2018 ఎన్నికల్లో తన గెలుపులో సూర్యాపేట పట్టణ ప్రజలు కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా తాను సూర్యాపేట అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పట్టణ శివారులో ఉన్న సద్దుల చెరువు, పుల్లారెడ్డి చెరువులు మినీ ట్యాంక్ బండ్ గా రూపాంతరం చెందుతున్నాయని ఆయన చెప్పారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/