హైకోర్టు తీర్పుపై విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలి

Indrakaran Reddy
Indrakaran Reddy

హైదరాబాద్‌: తెలంగాణ అటవీ,పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. దీంతో ప్రాజెక్టు వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు హైకోర్టు తీర్పు చెంప పట్టు వంటిదన్నారు. ఇప్పటికైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని, రాజకీయాల కోసం నిర్వాసితులను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణకు జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణాన్ని కూడా అడ్డుకోవాల‌ని విప‌క్షాలు చూస్తున్నాయ‌న్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా..ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇవ్వని పరిహారం టిఆర్‌ఎస్‌ ఇస్తుందని అల్లోల వెల్లడించారు.