మంత్రి హరీష్ హోం క్వారంటైన్ !

పీఏకు కరోనా కారణం

Harish Rao
Harish Rao

Hyderabad: మంత్రి హరీశ్‌రావు పీఏకు  కరోనా సోకడంతో  మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కరోనా వైరస్ విషయమై చైతన్య వంతుల్ని చేస్తున్నారు.

అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మరోవైపు,   సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.

ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/