జిల్లా ఆస్పత్రిలో మంత్రి ఎర్రబెల్లి ఆకస్మిక తనిఖీ

ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచన

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

మహబూబాబాద్: మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ లోపంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మార్పు జరగాలని అధికారులను ఆదేశించారు. వైద్య సేవలను ఇంకా మెరుగుపరచాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. జిల్లా ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేదని ఫిర్యాదులు అందడంతో తనిఖీ చెపట్టినట్లు చెప్పారు. ఇప్పటికైనా వైద్యులు ఇతర సిబ్బంది తమ పద్దతి మార్చుకొని అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మెరుగైన వైద్యం అందించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిఎం కెసిఆర్‌ జిల్లా ప్రధాన ఆసుపత్రికి రూ. 60 కోట్లు కేటాయించారని తెలిపారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మెడికల్‌ కళాశాల నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/