ప్రజలు తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

వరంగల్ : రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపురంలో గ్రామాల అభివృద్ధిపై నిర్దేశించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనం పెంచాలని ఆయన సూచించారు. ప్రజలు శ్రమదానం ద్వారా తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. గట్లనర్సింగాపూర్ అభివృద్ధి కోసం భాస్కర్ రావు అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. భాస్కర్ మాదిరిగానే ఆయా గ్రామాలకు చెందిన వారు విరాళాలు ఇచ్చి తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన చెప్పారు. గ్రామంలో చెత్తవేసే వారికి రూ.200 జరిమానా విధించాలని గట్లనర్సింగపురం గ్రామ సభలో ప్రజలు తీర్మానం చేశారు.


తాజా ఆద్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/