సిఎం మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపారు

Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

వరంగల్‌: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరోజు కాజీపేట మడికొండ పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిఎం కెసిఆర్ మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపారని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ఉచిత వాహనాలతో పాటు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. సమైక్య పాలనలో కుల వృత్తులు పూర్తిగా కనుమరుగయ్యాయని ఆయన ఆరోపించారు. కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కులవృత్తులకు పునరుజ్జీవనం పోసినట్టు ఆయన చెప్పారు. ఎస్ సి , ఎస్ టిల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని ఆయన చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి 60 రోజుల ప్రణాళికలను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎ అరూరి రమేష్, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు

.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/