ఫీవర్ ఆస్పత్రిని సందర్శించిన ఈటెల

Etela Rajender- Nallakunta Fever Hospital
Etela Rajender- Nallakunta Fever Hospital

హైదరాబాద్ : నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం సందర్శించారు. జ్వరం బారిన పడి చికిత్స పొందుతున్న వారితో ఫీవర్ ఆస్పత్రి కిక్కిరిసిపోతోంది. దీంతో మంగళవారం ఉదయం మంత్రి ఈటెల ఆస్పత్రి వైద్యులతో కలిసి ప్రతి వార్డును పరిశీలించారు. జ్వరపీడితులను పరామర్శించారు. జ్వరపీడితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఆస్పత్రి వైద్యులను ఆదేశించారు. విధులు నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందిని హెచ్చరించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/