విద్యార్థుల తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి

పిల్లలకు ఇంటిపనులు, వ్యవసాయపనులు చెప్పవద్దు

T. Harish Rao
T. Harish Rao

సంగారెడ్డి: పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలంగాణ మంత్రి హరీష్‌ రావు ఓ విజ్ఞప్తి చేశారు. పరీక్షల సమయంలో పిల్లలకు ఇంటి పనులు, వ్యవసాయ పనులు చెప్పవద్దని ఆయన కోరారు. ప్రతి విధ్యార్థికి జీవితంలో కీలకమైనది పదో తరగతి అని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో విధ్యార్థులకు చదువుకునే వాతావరణం కల్పించాలని హరీష్‌ రావు కోరారు. పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రతి రోజు వారు బడికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని రోజుల పాటు విధ్యార్థులను స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీలు, వినోదాల వంటి వాటికి దూరంగా ఉంచమని అన్నారు. పిల్లల భవిష్యత్తు కంటే తల్లిదండ్రులకు ఏదీ ముఖ్యం కాదని అన్నారు. పాఠశాలల్లో టీచర్లు చేస్తోన్న ప్రయత్నానికి తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని హరీష్‌ రావు సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/